యూత్, ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:30 AM
చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘రామ్‌నగర్ బన్నీ’ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు...
చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘రామ్‌నగర్ బన్నీ’ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వరద బాధితుల సహాయార్ధం తన వంతు ఆర్ధిక సహాయాన్ని చంద్రహాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రహాస్ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని హీరోగా మారాను. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. వాటిల్లో ఫస్ట్ మూవీ ‘రామ్‌నగర్ బన్నీ’. అక్టోబరులో విడుదలవుతుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు.