మీ నమ్మకమే నా ధైర్యం!

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:19 AM

తన తాజా చిత్రం ‘దేవర 1’ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జానియర్‌ ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ ఒపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించినందుకు...

తన తాజా చిత్రం ‘దేవర 1’ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జానియర్‌ ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ ఒపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్‌ మంగళవారం ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ‘తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘మా కంటే ఈ సినిమాను ఎక్కువగా సెలబ్రేట్‌ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్‌. మీ ప్రేమాభిమానాలను చూసి నాకు నోట మాట రావడం లేదు. నా వెన్నంటే ఉంటూ అంతులేని ప్రేమను పంచుతూ సపోర్ట్‌ చేస్తున్న నా అభిమానుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు చూపించే ప్రేమ వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగా.


మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు ఎప్పుడూ ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంటుంది. మీరు గర్వపడేలా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటా’ అన్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివకు, నిర్మాతలు సుధాకర్‌ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజుకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 16 , 2024 | 06:19 AM