ఒక్క క్షణం కూడా బోర్‌ ఫీలవ్వరు

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:41 AM

మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘హృదయమ్‌’ సినిమాతో మ్యూజిక్‌ ప్రియులకు చేరువయ్యారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌. ఆయన తెలుగులో సంగీతం అందించిన ‘ఖుషి’, ’హాయ్‌ నాన్న’ చిత్రాల్లోని పాటలు...

ఒక్క క్షణం కూడా బోర్‌ ఫీలవ్వరు

మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘హృదయమ్‌’ సినిమాతో మ్యూజిక్‌ ప్రియులకు చేరువయ్యారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌. ఆయన తెలుగులో సంగీతం అందించిన ‘ఖుషి’, ’హాయ్‌ నాన్న’ చిత్రాల్లోని పాటలు అందరినీ ఆకట్టుకుని చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.ఆయన మ్యూజిక్‌ అందించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్‌, కృతి శెట్టి హీరోహీరోయన్లుగా నటించగా, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.


‘‘నేను ఇప్పటివరకూ సంగీతం అందించిన చిత్రాల్లో ఇది చాలా ప్రత్యేకం. ఇందులో 16 పాటలను కంపోజ్‌ చేశాను. మొదట కేవలం 7 పాటలే అనుకున్నాం. కానీ తరువాత ఒక్కోటి పెరుగుతూ మొత్తం 16 పాటలయ్యాయి. అన్ని పాటలూ ఆకట్టుకుంటాయి. దర్శకుడు ఈ సినిమా కథను చాలా బాగా తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఒకటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. భావోద్వేగాలు, వినోదం కలగలసిన సినిమా ఇది. శర్వానంద్‌ని మునుపటికన్నా ఎనర్జిటిక్‌గా ఇందులో చూస్తారు. కృతి శెట్టి తన పాత్రకు న్యాయం చేశారు. థియేటర్స్‌లో చూసే ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా బోర్‌ ఫీలవ్వరు’’ అని చెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 03:41 AM