ఎప్పటికీ మాతోనే ఉంటావు

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:56 AM

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నందమూరి తారకరత్న గుండెపోటుతో అకాల మరణం పొంది ఈ ఆదివారానికి ఏడాది అయింది. ఆయన తొలి వర్థంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్‌ మీడియాలో...

ఎప్పటికీ మాతోనే ఉంటావు

తారకరత్న భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నందమూరి తారకరత్న గుండెపోటుతో అకాల మరణం పొంది ఈ ఆదివారానికి ఏడాది అయింది. ఆయన తొలి వర్థంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘నిన్ను నేను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ.. నేను పడుతున్న బాధ ఎవరికీ చెప్పలేనిది. నీకు, నాకు మధ్య సరిహద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు లేదు. నీ ఉనికి, నీ ప్రేమ, మాపై చూపించే ప్రభావం ఎప్పటికీ మరువలేం. నేను నిన్ను ముట్టుకోలేను కానీ నీ ఉనికి ఎప్పుడూ మా చుట్టే ఉంటుంది. మీరే మా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు’ అంటూ పేర్కొన్న అలేఖ్య పిల్లలతో ఉన్న ఫొటో షేర్‌ చేశారు.

Updated Date - Feb 19 , 2024 | 02:56 AM