నువ్వే నా సూర్యుడు.. చంద్రుడు

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:40 AM

నటుడు సిద్ధార్థ్‌, నటి అదితీరావు హైదరీ సోమవారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబంఽధించిన ఫొటోలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు అదితి. ‘నువ్వే నా సూర్యుడు.. చంద్రుడు.. నువ్వే నా తారాలోకం...

నటుడు సిద్ధార్థ్‌, నటి అదితీరావు హైదరీ సోమవారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబంఽధించిన ఫొటోలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు అదితి. ‘నువ్వే నా సూర్యుడు.. చంద్రుడు.. నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్దు’ అనే కాప్షన్‌ను ఆమె జత చేశారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని వీరి వివాహం జరిగిందని అంటున్నారు కానీ అక్కడి ఆలయంలో మాత్రం ఆ ఛాయలేవీ కనిపించలేదు. అక్కడ ఏ వివాహం కూడా జరగలేదని ఆలయ పూజారులు తెలియజేస్తున్నారు. మరెక్కడైనా ఆ వివాహం జరిగిందేమోననే భావన వ్యక్తమవుతోంది. అదితీరావు హైదరీ వనపర్తి సంస్థానాదీశుల్లో చివరి రాజుగా ఉన్న రామేశ్వర్‌రావు మనుమరాలు, ఆయన కూతురు విద్యారావు సంతానం అదితి. సిద్ధార్థ్‌, అదితి ఇద్దరికీ ఇది రెండో వివాహం. సిద్ధార్థ్‌ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను 2003లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.


ఆ తర్వాత 2007లో ఇద్దరి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అదితి 2002లో సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకొని 2012లో విడిపోయారు.

ఆంధ్రజ్యోతి, శ్రీరంగాపూర్‌

Updated Date - Sep 17 , 2024 | 05:40 AM