నువ్వో యోధురాలివి

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:01 AM

కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌కు టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ధైర్యం చెప్పారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీనాఖాన్‌ వీడియోను పోస్ట్‌ చేశారు సమంత....

కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌కు టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ధైర్యం చెప్పారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీనాఖాన్‌ వీడియోను పోస్ట్‌ చేశారు సమంత. ‘నువ్వో యోధురాలివి. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను... ధైర్యంగా ఉండు’ అని సమంత పేర్కొన్నారు. దీంతో హీ నాఖాన్‌ సమంతకు ధన్యవాదాలు తెలిపారు. ‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మీరు ఎదుర్కొనే తీరు అద్భుతం. తెరపైనే కాదు నిజ జీవితంలోనూ మీరు స్టారే. నాకు స్ఫూర్తిగా నిలిచారు. మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు’ అని సంతోషం వ్యక్తం చేశారు. తాను రొమ్ము కేన్సర్‌ బారిన పడినట్లు కొన్ని రోజుల క్రితం హీనాఖాన్‌ తెలిపారు. సమంత కూడా మయోసైటిస్‌ అనే వ్యాధి బారినపడి చికిత్స తీసుకుంటున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:01 AM