యేవం.. మహిళా సాధికారాణాం

ABN , Publish Date - May 11 , 2024 | 05:25 AM

‘కంటెంట్‌ను నమ్మి చేసే సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మా సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు దర్శకుడు ప్రకాశ్‌ దంతలూరి.

యేవం.. మహిళా సాధికారాణాం

‘కంటెంట్‌ను నమ్మి చేసే సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మా సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు దర్శకుడు ప్రకాశ్‌ దంతలూరి. ఆయన రూపొందించిన ‘యేవం’ సినిమాలో చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్‌, అషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమాలో వపర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న భరత్‌రాజ్‌ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘ఇటీవల చాందినీ చౌదరి, ఆషురెడ్డి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ రిలీజ్‌ చేశాం. మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారతను చాటి చెప్పే సినిమా ఇది. చిత్రంలో ప్రతి పాత్రకూ ఓ మార్క్‌ ఉంటుంది. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌ నేరేషన్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది’ అన్నారు దర్శకుడు.

Updated Date - May 11 , 2024 | 05:25 AM