యేవమ్‌ అందరికీ మంచి బ్రేక్‌ ఇస్తుంది

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:46 AM

చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యేవమ్‌’. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నవదీప్‌, గోపరాజు నిర్మాతలు...

యేవమ్‌ అందరికీ మంచి బ్రేక్‌ ఇస్తుంది

చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యేవమ్‌’. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నవదీప్‌, గోపరాజు నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘‘నేను బాగా గౌరవం ఇచ్చే కోస్టార్స్‌లో చాందిని ఒకరు. పలువురు మహిళలు ఉన్న ఈ సినిమా టీమ్‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ చిత్రం మంచి బ్రేక్‌నిస్తుంది’’ అని అన్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌. ఇంటర్వెల్‌, పతాక సన్నివేశాలు ఊహించని విధంగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘మనసుపెట్టి, నిజాయితీగా చేసిన ప్రయత్నం ఈ సినిమా’’ అని నిర్మాత నవదీప్‌ అన్నారు. చిత్ర దర్శకుడు ప్రకాశ్‌ దంతులూరి మాట్లాడుతూ ‘‘ఆసక్తికరంగా ఉండే వినోదాత్మక థ్రిల్లర్‌ ‘యేవమ్‌’’ అని చెప్పారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ ‘‘ఇందులో నాది పోలీస్‌ పాత్ర అనగానే యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుందని అనుకున్నాను. అయితే యాక్షన్‌తో పాటు అన్ని షేడ్స్‌ నా పాత్రలో ఉన్నాయి’’ అని చెప్పారు.

Updated Date - Jun 12 , 2024 | 03:46 AM