కరెంట్‌ షాక్‌తో యష్‌ అభిమానుల కన్నుమూత

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:51 AM

కన్నడ హీరో యష్‌ పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కర్ణాటకలోని గదగ్‌ జిల్లా లక్ష్మీశ్వర తాలూకా సూరణగి గ్రామంలో ఘనంగా వేడుకను...

కరెంట్‌ షాక్‌తో యష్‌ అభిమానుల కన్నుమూత

కన్నడ హీరో యష్‌ పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కర్ణాటకలోని గదగ్‌ జిల్లా లక్ష్మీశ్వర తాలూకా సూరణగి గ్రామంలో ఘనంగా వేడుకను నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఫ్లెక్సీని సిద్ధం చేసి, దాన్ని నిలబెట్టి కట్టే ప్రయత్నం చేస్తుండగా ఇనుప కడ్డీలకు విద్యుత్‌ తీగలు తగలడంతో హనుమంత హరిజన(21), మురళి నడవినమని(20), నవీన్‌గాజి (19) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Jan 09 , 2024 | 03:51 AM