సినిమాగా యండమూరి అంతర్ముఖం

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:29 AM

ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకొన్న ‘అంతర్ముఖం’ నవల ఇప్పుడు సినిమాగా రూపొందనుంది...

ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకొన్న ‘అంతర్ముఖం’ నవల ఇప్పుడు సినిమాగా రూపొందనుంది. భీమవరం టాకీసు పతాకంపై 117వ చిత్రంగా ఇది రూపొందుతుందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెప్పారు. యండమూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. సీనియర్‌ ఛాయాగ్రాహకుడు మీర్‌ ఈ సినిమాకు పని చేస్తున్నారు. అలాగే అల్ణాణి శ్రీధర్‌, నరసింహ నంది దర్శకత్వంలో రెండు సినిమాలు కూడా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రామసత్యనారాయణ చెప్పారు.

Updated Date - Sep 10 , 2024 | 03:29 AM