జానపద బాణీలతో యాదమ్మ

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:52 AM

బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ ‘భవనమ్‌’. సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహ ఉల్లాల్‌ ప్రధాన పాత్రలలో నటించారు...

జానపద బాణీలతో యాదమ్మ

బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ ‘భవనమ్‌’. సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహ ఉల్లాల్‌ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో ఆర్‌.బి.చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంగళవారం ట్రైలర్‌ను, జానపద బాణీలతో సాగే ‘యాదమ్మ’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ ‘‘దర్శకుడు బాలాచారి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఇందులో ఉన్న అన్ని పాటలు ఆకట్టుకుంటాయి’’ అని చెప్పారు. దర్శకుడు బాలాచారి కూరెళ్ల మాట్లాడుతూ ‘‘దాదాపు 20ఏళ్ల తర్వాత ఈ నిర్మాణ సంస్థతో కలసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 02:53 AM