మహిళలు మెచ్చిన పేకమేడలు

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:40 AM

వినోద్‌ కిషన్‌, అనూషకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘పేకమేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా...

వినోద్‌ కిషన్‌, అనూషకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘పేకమేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ ‘‘భావోద్వేగంతో నిండిన మంచి సినిమాను తీశారని చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి రుజువు చేసిన చిత్రమిది. ఈ సినిమా సక్సెస్‌ ఇలాంటి మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉత్సాహం ఇచ్చింది’’ అని నిర్మాత రాకేశ్‌ వర్రే చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: సృజన అడుసుమిల్లి, హంజా అలీ, డీఓపీ: హరిచరణ్‌.కె, సంగీతం: స్మరణ్‌సాయి.

Updated Date - Jul 21 , 2024 | 01:40 AM