మహిళలను తక్కువ చేస్తున్నారు

ABN , Publish Date - Oct 28 , 2024 | 12:12 AM

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు నటి సుహాసిని. సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మారిందని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు....

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు నటి సుహాసిని. సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మారిందని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కమర్షియల్‌ చిత్రాలకు సంబంధించి 2010 నుంచి ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు. హీరోలకు స్ట్రాంగ్‌ రోల్స్‌ రాస్తున్నారు. హీరోయిన్లకు మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారు’ అని సుహాసిని అన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 12:12 AM