యథార్థ సంఘటనలతో...

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:29 AM

రవికృష్ణ, సమీర్‌మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బర్త్‌డే బాయ్‌’. విస్కీ దర్శకత్వంలో ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌, టీజర్‌కు..

రవికృష్ణ, సమీర్‌మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బర్త్‌డే బాయ్‌’. విస్కీ దర్శకత్వంలో ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు విస్కీ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాను. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతీ పాత్ర కూడా ఎంటర్టైన్‌ చేస్తుంది. ఎం.ఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితుల జీవితంలో జరిగిన ఓ సంఘటన చుట్టూ ఈ సినిమా నడుస్తుంది’’ అని నిర్మాత ఐ.భరత్‌ తెలిపారు. ‘‘సినిమా అంటే ప్రాణమిచ్చే ఇలాంటి టీమ్‌తో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమా అందరికీ కొత్త అనుభూతిని పంచుతుంది’’ అని నటుడు రవికృష్ణ అన్నారు. వాకా మని, రాజా అశోక్‌, వెంకటేశ్‌, సాయి అరుణ్‌, రాహుల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Updated Date - Jul 11 , 2024 | 04:29 AM