థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో...

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:47 AM

వరుణ్‌ సందేశ్‌, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ద కానిస్టేబుల్‌’. ఆర్యన్‌సుభాన్‌ ఎస్‌.కే దర్శకత్వం వహిస్తుండగా, జగదీశ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది...

థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో...

వరుణ్‌ సందేశ్‌, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ద కానిస్టేబుల్‌’. ఆర్యన్‌సుభాన్‌ ఎస్‌.కే దర్శకత్వం వహిస్తుండగా, జగదీశ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘త్వరలోనే కానిస్టేబుల్‌ పాత్రతో.. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో మీ ముందుకు వస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘అద్భుతమైన కథ, ఆకట్టుకునే కథనం కుదిరిన సినిమా ఇది’’ అని నిర్మాత జగదీశ్‌ అన్నారు. ‘‘ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ నట విశ్వరూపం చూస్తారు’’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కే అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: వరప్రసాద్‌, కెమెరామెన్‌: హజరత్‌ షేక్‌, సంగీతం: సుభాశ్‌ఆనంద్‌.

Updated Date - Jun 21 , 2024 | 12:48 AM