ఈ సక్సెస్‌తో ఆ వెలితి తీరింది
ABN , Publish Date - Sep 01 , 2024 | 05:35 AM
‘పదిహేను రోజులుగా మా టీమ్‌లో ఎవరికీ సరిగ్గా నిద్ర లేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రశంసలు వస్తున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకుల తల మీద పెట్టుకుంటారని మరో సారి నిరూపించినందుకు కృతజ్ఞతలు...
‘పదిహేను రోజులుగా మా టీమ్‌లో ఎవరికీ సరిగ్గా నిద్ర లేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రశంసలు వస్తున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకుల తల మీద పెట్టుకుంటారని మరో సారి నిరూపించినందుకు కృతజ్ఞతలు. ఇంత వర్షంలో కూడా అన్ని చోట్లా హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ‘అంటే సుందరానికి’ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి ఉండేది. ‘సరిపోదా శనివారం’తో అది బ్యాలెన్స్ అయింది. ‘నిన్ను కోరి’ తర్వాత దానయ్యగారితో రెండో సినిమా. మా మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గ సెటప్ చేద్దాం. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ఉంటుంది’ అన్నారు హీరో నాని. శనివారం జరిగిన ‘సరిపోదా శనివారం’ థాంక్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘నా మీద నాకున్న నమ్మకం కంటే నా మీద నానికి నమ్మకం ఎక్కువ.
ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు కనుకే ఇలాంటి మంచి సినిమా వచ్చింది. ఇంత భారీ చిత్రాన్ని నేను హ్యాండిల్ చేయగలనని నమ్మి భారీ బడ్జెట్ పెట్టిన దానయ్యగారికి థాంక్స్. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టిన కల్యాణ్‌కు అభినందనలు’ అన్నారు. ‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. ఈ రోజు రిజల్ట్ అలాగే ఉంది’ అన్నారు దానయ్య.