మాస్టారు కథతో...

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:43 AM

శ్యామ్‌ సెల్వన్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. రాజేంద్రప్రసాద్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆముదేశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జె.ఎమ్‌.ప్రదీ్‌పరెడ్డి నిర్మిస్తున్నారు...

మాస్టారు కథతో...

శ్యామ్‌ సెల్వన్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. రాజేంద్రప్రసాద్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆముదేశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జె.ఎమ్‌.ప్రదీ్‌పరెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్‌చంద్ర మాట్లాడుతూ ‘‘నా మనవడు శ్యామ్‌ ఇటువంటి మంచి కథతో సినిమా కెరీర్‌ను ఆరంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘మొదటి సినిమాలోనే రాజేంద్రప్రసాద్‌ వంటి లెజెండ్‌తో స్ర్కీన్‌ పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని హీరో శ్యామ్‌ సెల్వన్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎ.ఆర్‌.శివరాజ్‌, సినిమాటోగ్రాఫర్‌: ఎ.డి.కరుణ్‌, సంగీతం: మాధవపెద్ది సురేశ్‌చంద్ర.

Updated Date - Jun 17 , 2024 | 03:43 AM