మృగరాజు ముఫాసా కథతో...

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:32 AM

హాలీవుడ్‌ ఆల్‌ టైమ్‌ క్లాసికల్‌ హిట్స్‌లో ‘ద లయన్‌ కింగ్‌’ సినిమా ఒకటి. 90వ దశకంలో రిలీజైన ‘ద లయన్‌ కింగ్‌’ అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. మృగరాజుగా ముఫాసా,బుల్లి సింహంగా...

మృగరాజు ముఫాసా కథతో...

హాలీవుడ్‌ ఆల్‌ టైమ్‌ క్లాసికల్‌ హిట్స్‌లో ‘ద లయన్‌ కింగ్‌’ సినిమా ఒకటి. 90వ దశకంలో రిలీజైన ‘ద లయన్‌ కింగ్‌’ అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. మృగరాజుగా ముఫాసా,బుల్లి సింహంగా సింబా పాత్రలు అబాలగోపాలన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు రీమేక్‌గా 2019లో ఇదే పేరుతో మరో సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ‘ద లయన్‌ కింగ్‌’ ఒరిజినల్‌, రీమేక్‌లోనూ ముఫాసా పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముఫాసా పాత్ర బాక్‌స్టోరీ ఆధారంగా నిర్మాణ సంస్థ డిస్నీ ‘ముఫాసా’ ‘ద లయన్‌ కింగ్‌’ సినిమాను రూపొందిస్తోంది. ఇది ‘ద లయన్‌ కింగ్‌’ సినిమాకు ప్రీక్వెల్‌. ఆస్కార్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ బారీ జెన్కిన్స్‌ దర్శకత్వం వహించగా, అడెల్‌ రొమాన్‌స్కీ, మార్క్‌ సెర్యాక్‌ నిర్మిస్తున్నారు. లైవ్‌ యాక్షన్‌ సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. అత్యద్భుత విజువల్స్‌తో సాగిన ఈ ట్రైలర్‌లో రఫికీ(కొండముచ్చు), టిమాన్‌(ముంగీస), పుంబా(అడవి పంది) పాత్రలు కలసి ముఫాసా కథను ఓ బుల్లి సింహానికి చెప్తాయి. డిసెంబర్‌ 20న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది.

Updated Date - Apr 30 , 2024 | 06:32 AM