స్నేహితుల కథతో...

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:40 AM

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా హీరోలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. తాజాగా ‘ఓ మై ఫ్రెండ్‌’ అనే లిరికల్‌ వీడియోను మంగళవారం విడుదల చేశారు...

స్నేహితుల కథతో...

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా హీరోలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. తాజాగా ‘ఓ మై ఫ్రెండ్‌’ అనే లిరికల్‌ వీడియోను మంగళవారం విడుదల చేశారు. నటుడు శివాజీ, దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్‌ ఈ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘నేటి యువతకు నచ్చే సినిమా ఇది. పాటలు బాగున్నాయి. దర్శకుడు విక్రమ్‌రెడ్డి బాగా తీశాడు. పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడు’ అని ప్రశంసించారు. ఈ సినిమా పోస్టర్‌ చూస్తుంటే ‘మేం వయసుకు వచ్చాం’ నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని త్రినాధరావు అన్నారు. చిత్ర నిర్మాణం మీద, కథ మీద నాలెడ్జ్‌, గ్రిప్‌ ఉన్న నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అని ప్రసన్నకుమార్‌ అన్నారు. ‘కొత్తవాళ్లతో ఈ రోజుల్లో సినిమా తీయడానికి గట్స్‌ కావాలి. కంటెంట్‌ మీద నమ్మకం ఉండాలి. ఇది మ్యాటర్‌ ఉన్న సినిమాలా అనిపిస్తోంది’ అన్నారు.

Updated Date - Mar 13 , 2024 | 03:40 AM