మిషన్‌ మంగళ్‌ డైరెక్టర్‌తో...

ABN , Publish Date - May 29 , 2024 | 06:32 AM

బాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ బిజీయెస్ట్‌ యాక్టర్స్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒకరు. ఇటీవలే ‘మైదాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా...

మిషన్‌ మంగళ్‌ డైరెక్టర్‌తో...

బాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ బిజీయెస్ట్‌ యాక్టర్స్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒకరు. ఇటీవలే ‘మైదాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నాన్‌స్టా్‌పగా వరుస చిత్రాలు, సీక్వెల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘సింగం 3’, ‘దే దే ప్యార్‌ దే 2’, ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ సినిమా సీక్వెల్స్‌లో నటిస్తున్న ఆయన.. వీటి తర్వాత ‘మిషన్‌ మంగళ్‌’ డైరెక్టర్‌ జగన్‌ శక్తి తెరకెక్కించే సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ చెప్పిన కథ ఆయనను ఎంతగానో ఆకట్టుకుందని.. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి వచ్చే ఏడాది ప్రధమార్థంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.


మరోసారి అజయ్‌ను ఢీకొట్టే పాత్రలో...

అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘షైతాన్‌’ చిత్రంలో ఆర్‌.మాధవన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. వెండితెరపై వీరి ముఖాముఖికి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఆర్‌.మాధవన్‌ మరోసారి అజయ్‌దేవ్‌గణ్‌ను ఢీకొట్టే పాత్రలో కనిపించనున్నారని టాక్‌. అజయ్‌ నటిస్తున్న ‘దే దే ప్యార్‌ దే 2’ చిత్రంలో ఆర్‌.మాధవన్‌ ఓ కీలక పాత్ర పోషించడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు.

Updated Date - May 29 , 2024 | 06:32 AM