అత్యద్భుత విజువల్స్‌తో...

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:17 AM

తమిళ హీరో సూర్య నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు ‘వేదాలమ్‌, వీరుడొక్కడే, వివేకం’ వంటి చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపఠాని, యోగిబాబు, బాబీడియోల్‌ తదితరులు...

అత్యద్భుత విజువల్స్‌తో...

తమిళ హీరో సూర్య నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు ‘వేదాలమ్‌, వీరుడొక్కడే, వివేకం’ వంటి చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపఠాని, యోగిబాబు, బాబీడియోల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేేసందుకు సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. మంగళవారం ’కంగువ’ టీజర్‌ విడుదలైంది. అత్యద్భుత విజువల్స్‌తో ఈ టీజర్‌ ఆకట్టుకుంది. ఇందులో సూర్య పోరాట యోధుడిగా చేసిన యాక్షన్‌ సీన్స్‌ థియేటర్స్‌లో అందరిచేత విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌: నిశాద్‌యూసుఫ్‌, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఏ జే రాజా, కో ప్రొడ్యూసర్‌: నేహా జ్ఞానవేల్‌రాజా.

Updated Date - Mar 20 , 2024 | 06:17 AM