ఆధ్యాత్మిక అంశాలతో...

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:23 AM

అశ్విన్‌బాబు, అర్బాజ్‌ఖాన్‌, దిగంగనా సూర్యవంశీ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘శివం భజే’. బ్రహ్మాజీ, దేవి ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అప్సర్‌ దర్శకత్వంలో మహేశ్వర్‌రెడ్డి...

ఆధ్యాత్మిక అంశాలతో...

అశ్విన్‌బాబు, అర్బాజ్‌ఖాన్‌, దిగంగనా సూర్యవంశీ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘శివం భజే’. బ్రహ్మాజీ, దేవి ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అప్సర్‌ దర్శకత్వంలో మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం ‘శివంభజే’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆధ్యాత్మిక అంశాలకు యాక్షన్‌ హంగులను మేళవించి రూపొందించిన చిత్రమిదని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. జూలైలో ‘శివం భజే’ను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. టైటిల్‌తోనే మా సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:వికాస్‌ బడిస, సినిమాటోగ్రఫీ: దాసరథి శివేంద్ర

Updated Date - Jun 20 , 2024 | 02:23 AM