రేసీ స్ర్కీన్‌ప్లేతో...

ABN , Publish Date - May 30 , 2024 | 12:14 AM

‘బెదురులంక’తో సూపర్‌హిట్‌ అందుకున్న కార్తీకేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించగా, వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు...

రేసీ స్ర్కీన్‌ప్లేతో...

‘బెదురులంక’తో సూపర్‌హిట్‌ అందుకున్న కార్తీకేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించగా, వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తీకేయ మీడియాతో ముచ్చటించారు. ‘‘లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ సినిమా కథను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వినిపించారు. కథలోని ఎమోషనల్‌ ఇంటెన్సిటీ, మలుపులు నచ్చి వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నేను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా.. అందరూ పోల్చుకునేలా ఒక కామన్‌ మ్యాన్‌ పాత్రలో కనిపిస్తాను. ఇందులో హీరో అనేక సమస్యల్లో చిక్కుకోవడం.. వాటి నుంచి తెలివిగా బయటపడడమే కథాంశం.


దీనిని తెరపైన చూసే ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా.. రేసీ స్ర్కీన్‌ప్లేతో దర్శకుడు ప్రశాంత్‌ ఈ సినిమాను మలిచారు. ఇందులోని యాక్షన్‌, ఎమోషన్‌ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా నా ఇమేజ్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. నేను ఎప్పటినుంచో ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న సినిమాలో నటిద్దామనుకుంటున్నా. అది ఈ సినిమాతో కుదిరింది. నా కెరీర్‌కు బూస్ట్‌నిచ్చే పర్ఫ్‌క్ట్‌ మూవీ ఇది. ఈ సినిమాలో రెగ్యులర్‌ టైప్‌ పాటలుండవు. ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఎంగేజ్‌ చేస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - May 30 , 2024 | 12:14 AM