Dirtyfellow : కొత్త తరహా కంటెంట్‌తో...

ABN , Publish Date - May 18 , 2024 | 05:54 AM

శాంతి చంద్ర హీరోగా, మాజీ మిస్‌ ఇండియా సిమ్రితి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డర్టీఫెలో’. దీపిక సింగ్‌, సత్యప్రకాశ్‌, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Dirtyfellow : కొత్త తరహా కంటెంట్‌తో...

శాంతి చంద్ర హీరోగా, మాజీ మిస్‌ ఇండియా సిమ్రితి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డర్టీఫెలో’. దీపిక సింగ్‌, సత్యప్రకాశ్‌, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి.ఎస్‌ బాబు నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ఠ చేతుల మీదుగా యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వశిష్ఠ మాట్లాడుతూ ‘కొత్త తరహా కంటెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడి శైలి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది’ అని అన్నారు. శాంతి చంద్ర మాట్లాడుతూ ‘డర్టీఫెలో ఆడియోకు చక్కటి స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు.

Updated Date - May 18 , 2024 | 05:54 AM