మామయ్యకు ప్రేమతో...

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:50 AM

ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన పవన్‌కల్యాణ్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి వరుస బహుమతులు పలకరిస్తున్నాయి. ఇటీవలే వదిన సురేఖ నుంచి ఖరీదైన మాంట్‌బ్లాంక్‌ పెన్నును...

మామయ్యకు ప్రేమతో...

ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన పవన్‌కల్యాణ్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి వరుస బహుమతులు పలకరిస్తున్నాయి. ఇటీవలే వదిన సురేఖ నుంచి ఖరీదైన మాంట్‌బ్లాంక్‌ పెన్నును అందుకున్న పవన్‌, తాజాగా తన మేనల్లుడు సాయి దుర్గాతేజ్‌ నుంచి మరో బహుమతి అందుకున్నారు. ఆదివారం సాయి దుర్గాతేజ్‌ పవన్‌కు హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా సిరీస్‌ ‘స్టార్‌వార్స్‌’ ఫ్రాంచైజీకి చెందిన ‘స్టార్‌వార్స్‌ లెగో మిలీనియమ్‌ ఫాల్కన్‌’ కిట్‌ను అందించారు. దాదాపు 1.20 లక్షల విలువ చేసే ఈ బహుమతిలో ‘స్టార్‌వార్స్‌’ సినిమాలోని ప్రధాన పాత్రధారుల బొమ్మలు, వారి ఆయధాలు, వాహనాలు ఉంటాయి. ‘


‘నా బాల్యంలో నాకు ‘స్టార్‌వార్స్‌’ను, లెగో టాయ్స్‌ను పరిచయం చేసిన నా జేడీ మాస్టర్‌ (గురువు), ఉప ముఖ్యమంత్రికి ఇది నా కానుక. మళ్లీ ఇన్నేళ్లకు మీలోని బాలుడికి ఈ బహుమతిని ఇవ్వడం ద్వారా నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకునే అవకాశం దక్కింది’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 03:50 AM