ప్రేమ, కుటుంబ బాంధవ్యాలతో...

ABN , Publish Date - May 15 , 2024 | 12:19 AM

నిఖిల్‌ విజయేంద్రసింహా, తేజు అశ్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘సంగీత్‌’. సాద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ మనోహరన్‌, మాజ్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు...

ప్రేమ, కుటుంబ బాంధవ్యాలతో...

నిఖిల్‌ విజయేంద్రసింహా, తేజు అశ్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘సంగీత్‌’. సాద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ మనోహరన్‌, మాజ్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్ర్కిప్ట్‌ అందించగా, శౌర్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌.కార్తీకేయ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు సాద్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘ప్రేమ, కుటుంబ బాంధవ్యాలతో సాగే కథ ఇది. ఓ పెళ్లి వేడుకలో జరిగే సంఘటనలను వినోదభరితంగా తెరకెక్కిస్తున్నాము’’ అని అన్నారు. హీరో నిఖిల్‌ విజయేంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ నా హృదయానికి దగ్గరగా ఉంది. ఇందులో కథానాయకుడు సమర్థ్‌ పాత్రలో నేను, స్వర పాత్రలో తేజు అశ్విని నటిస్తున్నారు’’ అని చెప్పారు.

Updated Date - May 15 , 2024 | 12:19 AM