ఆకట్టుకునే విజువల్స్‌తో... ‘మా ఊరి జాతరలో’

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:26 AM

అల్లరి నరేశ్‌, అమృత అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై...

అల్లరి నరేశ్‌, అమృత అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘మా ఊరి జాతరలో’ పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఫోక్‌ సాంగ్‌లో లీడ్‌ పెయిర్‌ కెమిస్ట్రీ, విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. సింధూరి విశాల్‌, హరిగౌర ఆలపించగా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ : చోటా కె ప్రసాద్‌, డిఓపీ : ఎం. రిచర్డ్‌ నాథన్‌.

Updated Date - Jul 17 , 2024 | 06:26 AM