ఆకట్టుకునే భావోద్వేగాలతో

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:44 AM

నూతన దర్శకుడు శివ పాలడుగు దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. అజయ్‌ఘోష్‌, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం సినిమా...

ఆకట్టుకునే భావోద్వేగాలతో

నూతన దర్శకుడు శివ పాలడుగు దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. అజయ్‌ఘోష్‌, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ‘‘రంగస్థలం’ సినిమాలో అజయ్‌ఘోష్‌ నటన చూసి ఈ సినిమా కథకు ఆయనే పర్ఫెక్ట్‌ అని అనుకున్నాను. కథ వినగానే ఆయనకూ నచ్చి నటించడానికి ఒప్పుకున్నారు. ఇరవయ్యేళ్ల వయసులో సంగీతంలో రాణించాలని అనుకుని కొన్ని కారణాలతో ఆగిపోయిన ఓ వ్యక్తి యాభై ఏళ్లు వచ్చాక తన కలను ఎలా సాధించాడు అనేదే చిత్ర కథ. ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో చాందినీ చౌదరి నటించారు. సినిమాలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని చెప్పారు.

Updated Date - Jun 13 , 2024 | 04:44 AM