భావోద్వేగాలతో ‘నాన్నా మళ్లీ రావా!’

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:54 AM

శివాజీరాజా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాన్నా మళ్లీ రావా!’. నిర్దేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్‌ డి.ఉమామహేశ్వర రావు నిర్మిస్తున్నారు...

భావోద్వేగాలతో ‘నాన్నా మళ్లీ రావా!’

శివాజీరాజా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాన్నా మళ్లీ రావా!’. నిర్దేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్‌ డి.ఉమామహేశ్వర రావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ ‘‘భావోద్వేగాలు మిళితమైన ఇటువంటి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు నిర్దేశ్‌ మాట్లాడుతూ ‘‘నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి డీఓపీ: డీ.వై గిరి, సంగీతం: ఆర్మన్‌ మెరుగు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రోసి రెడ్డి.

Updated Date - Apr 25 , 2024 | 05:54 AM