అద్భుతమైన విజువల్స్‌తో..

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:34 AM

వరుణ్‌ సందేశ్‌ నటిస్తున్న చిత్రం ‘విరాజి’. ఆద్యంత్‌ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను..

వరుణ్‌ సందేశ్‌ నటిస్తున్న చిత్రం ‘విరాజి’. ఆద్యంత్‌ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను దర్శకుడు సాయి రాజేశ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌లో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్‌ లుక్‌ అదిరిపోయింది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌’’ అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. ‘‘ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వాటిని థియేటర్లలో చూసి ఆశ్చర్యపోతారు’’ అని దర్శకుడు ఆద్యంత్‌ హర్ష తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 01:34 AM