అన్ని రకాల భావోద్వేగాలతో...
ABN , Publish Date - Nov 21 , 2024 | 06:14 AM
దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో ఆయన తన కుమారుడు అమ్మ రాగిన్‌రాజ్‌ను హీరోగా పరిచయం
దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో ఆయన తన కుమారుడు అమ్మ రాగిన్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్ సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు.