అన్ని రకాల ఎమోషన్స్‌తో...

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:30 AM

యూత్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జంతో కలసి రూపొందిస్తున్న చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లు...

అన్ని రకాల ఎమోషన్స్‌తో...

యూత్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జంతో కలసి రూపొందిస్తున్న చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లు. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేస్తూ బుధవారం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘‘కథను నమ్మి ఎమోషనల్‌గా ఫీల్‌ అయి చేసిన సినిమా ఇది. ఏప్రిల్‌ 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. దర్శకుడు విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడిని కావాలన్న నా 15 ఏళ్ల కల ఈ చిత్రంతో తీరుతోంది. ఇది అందరూ అనుకున్నట్లు కేవలం ఎంటర్టైనర్‌ మాత్రమే కాదు.. అన్ని రకాల ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి’’ అని అన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 02:30 AM