అద్భుతమైన కథతో...

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:45 AM

సంయుక్త లీడ్‌రోల్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది. యోగేశ్‌ కే.ఎం.సీ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రారంభించారు...

సంయుక్త లీడ్‌రోల్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది. యోగేశ్‌ కే.ఎం.సీ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేశ్‌ దండా మాట్లాడుతూ ‘‘కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కథ అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి స్ర్కిప్ట్‌లో భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను’’ అని సంయుక్త మీనన్‌ అన్నారు. ‘‘ఇందులో యాక్షన్‌ ఘట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని’’ అని దర్శకుడు యోగేశ్‌ తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 05:45 AM