ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో...

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:00 AM

‘బిగ్‌బాస్‌’ అమర్‌దీప్‌ హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నటించే చిత్రం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత ఎ.ఎం.రత్నం...

ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో...

‘బిగ్‌బాస్‌’ అమర్‌దీప్‌ హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నటించే చిత్రం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత ఎ.ఎం.రత్నం కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, బసిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు. వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్‌ కూండ్ల మాట్లాడుతూ ‘భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో ఈ సినిమా తీస్తున్నాం’ అని చెప్పారు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లకముందే ఈ సినిమాకు సైన్‌ చేసినట్లు హీరో అమర్‌దీప్‌ చెప్పారు. నటి సురేఖా వాణి మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్‌ విన్న తర్వాత వీళ్లు చేస్తారా లేదా అనే అనుమానం వచ్చింది. దర్శకనిర్మాతల మీద నమ్మకంతోనే నా బిడ్డను వాళ్ల చేతులో పెట్టా’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఫొటోగ్రఫీ: బాల సరస్వతి.

Updated Date - Feb 02 , 2024 | 03:00 AM