సరికొత్త కథాంశంతో...

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:21 AM

షూటింగ్‌ పూర్తయింది. రమాకాంత్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కందుల గ్రూప్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు...

సరికొత్త కథాంశంతో...

విశ్వ కార్తిక్‌, ఆయూషి పటేల్‌ జంటగా నటించిన ‘కలియుగం పట్టణం’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. రమాకాంత్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కందుల గ్రూప్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘టాలీవుడ్‌లో ఇలాంటి కాన్సె్‌ప్టతో ఏ సినిమా రాలేదు. సరికొత్త పాయింట్‌తో సందేశాన్ని మిళితం చేసి కుటుంబ సమేతంగా చూసే విధంగా చిత్రాన్ని రూపొందించాం.. గ్యారీ బీ హెచ్‌ వంటి టాప్‌ టెక్నీషియన్‌ మా సినిమాకు ఎడిటర్‌గా పని చేశారు’ అని చెప్పారు. కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ‘కడప జిల్లాలో 45 రోజుల పాటు షూటింగ్‌ జరగడంతో చిత్రం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 22న సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి సాహిత్యం! చంద్రబోస్‌, భాస్కరభట్ల, ఫొటోగ్రఫీ: చరణ్‌ మాధవనేని, సంగీతం: అజయ్‌ అరసాడ, నిర్మాతలు: డాక్టర్‌ కె. చంద్ర ఓబుల్‌రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌.

Updated Date - Feb 20 , 2024 | 05:21 AM