సరికొత్త కాన్సెప్ట్‌తో...

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:14 AM

వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయకుడు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఓ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు....

వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయకుడు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఓ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రుహాని శర్మ హీరోయిన్‌. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమాను ఆరంభించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: రామకృష్ణ అర్రం, కెమెరా: జిజు సన్నీ, సంగీతం: జిబ్రాన్‌.

Updated Date - Jul 29 , 2024 | 04:14 AM