హారర్‌ మిస్టరీ కథాంశంతో...

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:23 AM

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఓ హారర్‌ మిస్టరీ సినిమాలో నటిస్తున్నారు. ‘చావు కబురు చల్లగా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్‌ పెగళ్లపాటి...

హారర్‌ మిస్టరీ కథాంశంతో...

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఓ హారర్‌ మిస్టరీ సినిమాలో నటిస్తున్నారు. ‘చావు కబురు చల్లగా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్‌ యెర్నేని క్లాప్‌ కొట్టగా, నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సతీశ్‌ కిలారు, అన్మోల్‌ శర్మ స్ర్కిప్ట్‌ అందించారు. జూలై 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని, ఇప్పటివరకూ ఎవ్వరూ తీయని కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్‌: నిరంజన్‌ దేవరమానే, డీఓపీ: చిన్మయ్‌ సలార్కర్‌, సంగీతం: బి.అజనీశ్‌ లోక్‌నాథ్‌.

Updated Date - Jul 02 , 2024 | 12:23 AM