మంచి సబ్జెక్ట్‌తో...
ABN , Publish Date - Mar 21 , 2024 | 05:46 AM
అరుణ్ ఆదిత్య, అప్సర రాణి హీరోహీరోయిన్లుగా ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. కృష్ణబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మీ , బేబీ వినూత, ఉదయ్ భాను కీలక పాత్రల్లో నటిస్తున్నారు...

అరుణ్ ఆదిత్య, అప్సర రాణి హీరోహీరోయిన్లుగా ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. కృష్ణబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మీ , బేబీ వినూత, ఉదయ్ భాను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నల్లా శ్రీదేవి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ ‘‘మంచి సబ్జెక్ట్‌తో తెరకెకుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేసి మీ ముందుకు తెస్తాం. ఈ చిత్రం మీ అందరినీ తప్పక అలరిస్తుంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి డిఓపి: ఆర్ భాస్కర్, సంగీతం: యం.యం శ్రీలేఖ, సహ నిర్మాత: చైతన్య కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వెంకటేష్, ఖుషి