వైవిధ్యమైన కథతో...

ABN , Publish Date - May 13 , 2024 | 12:09 AM

అశ్విన్‌ బాబు హీరోగా అప్సర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు...

వైవిధ్యమైన కథతో...

అశ్విన్‌ బాబు హీరోగా అప్సర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కుతోన్న న్యూ ఏజ్‌ సినిమా ఇది’’ అని చెప్పారు. అప్సర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టైటిల్‌కు, ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన లభించినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో రౌద్ర రూపంలో హీరో పాత్ర కనపడుతోంది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్‌నటుడు అర్బాజ్‌ ఖాన్‌, హైపర్‌ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: చోటా కె నాయుడు, డీఓపీ: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్‌ బడిద.

Updated Date - May 13 , 2024 | 12:09 AM