కామెడీ టచ్‌తో

ABN , Publish Date - May 02 , 2024 | 04:32 AM

నూతన నటీనటులతో దర్శకుడు నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘తిండిబోతు దెయ్యం’. శిరీష నరసింహ బోదాసు నిర్మిస్తున్నారు....

కామెడీ టచ్‌తో

నూతన నటీనటులతో దర్శకుడు నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘తిండిబోతు దెయ్యం’. శిరీష నరసింహ బోదాసు నిర్మిస్తున్నారు. మంగళవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. తొలిషాట్‌కు దర్శకుడు రేలంగి నరసింహారావు క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్తదనం ఉన్న కథతో తెరకెక్కిస్తున్నాం. హీరోగా నటిస్తున్నాను. కామెడీ టచ్‌తో కూడిన హారర్‌ చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అన్నారు. ఇప్పుడు వస్తున్న హారర్‌ కామెడీ సినిమాలకు మా చిత్రం భిన్నంగా ఉంటుంది అని నిర్మాత తెలిపారు. మోనికా సమత్తార్‌, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేందర్‌ ఎం.

Updated Date - May 02 , 2024 | 04:32 AM