ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌ హీరోయిన్‌ ఎవరు?

ABN , Publish Date - May 22 , 2024 | 12:57 AM

భారతరత్న గ్రహీత, ప్రఖ్యాత గాయని, దివంగత ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మీ జీవితాన్ని వెండితెరపైకి ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌ను తెరకెక్కించేది...

ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌ హీరోయిన్‌ ఎవరు?

భారతరత్న గ్రహీత, ప్రఖ్యాత గాయని, దివంగత ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మీ జీవితాన్ని వెండితెరపైకి ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌ను తెరకెక్కించేది ఎవరు, నిర్మించేది ఎవరు అన్న విషయం ఇంకా అధికారికంగా తెలియనప్పటికీ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించేది ఎవరనే చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతోంది. నయనతార, త్రిష, రష్మిక పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే బెంగుళూరుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ, పేరొందిన డైరెక్టర్‌తో కలసి స్ర్కిప్ట్‌ పనుల్లో తలమునకలై ఉన్నట్లు తెలిసింది. స్ర్కిప్ట్‌ పనులన్నీ పూర్తయ్యాక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే, అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 22 , 2024 | 12:57 AM