ఎవరు హీరో?, ఎవరు విలన్?
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:07 AM
మార్కెటింగ్ స్కామ్ అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’. ప్రజిన్ పద్మనాభన్, జీవా, విజయ్ విశ్వ, సాయి ధన్య, షాలిని ముఖ్య తారాగణం...

మార్కెటింగ్ స్కామ్ అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’. ప్రజిన్ పద్మనాభన్, జీవా, విజయ్ విశ్వ, సాయి ధన్య, షాలిని ముఖ్య తారాగణం. రామ్ ప్రభ దర్శకత్వంలో వ్యాపారవేత్త వేల్ మురుగన్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్‌తో సినిమాలు రాలేదు. ఇందులో ఎవరు హీరో?, ఎవరు విలన్? అనేది క్లైమాక్స్ వరకూ తెలియదు. సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు’ అన్నారు. ఈ చిత్రానికి మనోజ్ కుమార్ బాబు సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: సురేశ్‌కుమార్, సుందరం.