ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

ABN , Publish Date - May 18 , 2024 | 05:59 AM

తన సినిమా ప్రచార కార్యక్రమాలపైన సైతం ఆచితూచి స్పందిస్తారు ప్రభాస్‌. అలాంటిది శుక్రవారం ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒక్కసారిగా నెటిజన్లలో చర్చనీయాంశం అయింది. ‘డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వేచి చూడండి’

ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

తన సినిమా ప్రచార కార్యక్రమాలపైన సైతం ఆచితూచి స్పందిస్తారు ప్రభాస్‌. అలాంటిది శుక్రవారం ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒక్కసారిగా నెటిజన్లలో చర్చనీయాంశం అయింది. ‘డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వేచి చూడండి’ అంటూ ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అవ్వడంతో పాటు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్‌ ఓ ఇంటివాడవబోతున్నారు అని, తన కాబోయే జోడీని పరిచయం చేయబోతున్నారనీ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే త్వరలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల ఉండడంతో ఆ సినిమా అప్డేట్‌ గురించి ప్రభాస్‌ ఇలా స్పందించారంటూ మరికొందరు భావిస్తున్నారు. ‘కల్కి’ చిత్రంలో కమల్‌హాసన్‌, దీపికా పదుకొనేకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేయబోతున్నారనీ, దానికోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Updated Date - May 18 , 2024 | 05:59 AM