వీళ్లిద్దరిలో ఎవరు?

ABN , Publish Date - May 07 , 2024 | 05:59 AM

కన్నడ సూపర్‌స్టార్‌ యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌ పైకి వెళ్లనుంది...

వీళ్లిద్దరిలో ఎవరు?

కన్నడ సూపర్‌స్టార్‌ యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. సినిమాలో హీరో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా అనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు దర్శకనిర్మాతలు. నయనతార ఆ పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే పాన్‌ ఇండియా సినిమా కనుక చెల్లెలు పాత్రకు నయనతార కాకుండా కృతి సనన్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందా అనే కొత్త ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. నయనతార సౌత్‌ వరకూ ఓకే కానీ బాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్లలో కృతి ఒకరు కనుక ఆమెను తీసుకుంటే సినిమాకు మరింత ప్లన్‌ అవవచ్చు అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నయతార, కృతి.. వీరిద్దరిలో ఎవరు అనే విషయం త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు. ఇక యశ్‌ సరసన కియారా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - May 07 , 2024 | 05:59 AM