అసిన్ ఇప్పుడెక్కడ ఉంది?
ABN , Publish Date - May 29 , 2024 | 06:17 AM
‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ భామ అసిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? తన 15వ ఏట సినీ రంగ ప్రవేశం చేసిన అసిన్ తెలుగులో బాలకృష్ణ సరసన...

‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ భామ అసిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? తన 15వ ఏట సినీ రంగ ప్రవేశం చేసిన అసిన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘లక్ష్మీనరసింహా’, ‘నాగార్జునతో ‘శివమణి’, వెంకటేశ్‌తో ‘ఘర్షణ’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమల్‌హాసన్ ‘దశావతారం’ చిత్రంలోనూ, సూర్య ‘గజని’ చిత్రాల్లో ఆమె నటనను మరువలేం. ఇలా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన అసిన్ అమీర్‌ఖాన్ ‘గజని’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సల్మాన్‌ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్‌కుమార్, అభిషేక్ బచ్చన్ చిత్రాల్లో నటించంది. ఆమె నటించిన చివరి చిత్రం 2015లో వచ్చిన ‘ఆల్ ఈజ్ వెల్’. ఆ తర్వాత నటన ఇక వద్దనుకుని 2016లో రాహుల్ శర్మని వివాహం చేసుకుంది. ఇతను ఆషామాషీ వ్యక్తి కాదు ‘మైక్రో మాక్స్’ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ సంస్థ సీఈఓ కూడా. రాహుల్ శర్మ ఆస్తి ఎంతో తెలుసా?.. అక్షరాలా రూ. 13 వందల కోట్లు. మొత్తానికి అసిన్ తెలివైందే కాదు అదృష్టవంతురాలు కూడా. ఈ దంపతులకు ఓ కుమార్తె ఇప్పుడు.