కథ విన్నప్పుడే.. సక్సెస్‌ను ఊహించా

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:43 AM

తెలుగులో మంచి ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న అతికొద్ది తమిళ నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన 50వ చిత్రం ‘మహరాజా’. అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి కీలక పాత్రలు...

కథ విన్నప్పుడే.. సక్సెస్‌ను ఊహించా

తెలుగులో మంచి ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న అతికొద్ది తమిళ నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన 50వ చిత్రం ‘మహరాజా’. అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి కీలక పాత్రలు పోషించారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో సుధన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుని.. హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని ఎమోషన్‌తో ప్రేక్షకులు చివరివరకూ ప్రయాణిస్తారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాని ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘నన్ను సినిమా సినిమాకి మరింతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కథ విన్నప్పుడే ఇది అందరి మనసులని గెలిచే సినిమా అవుతుందని ఊహించా. ఈ సక్సెస్‌ని ప్రేక్షకులకి అంకితం చేస్తున్నాను’’ అని విజయ్‌ సేతుపతి చెప్పారు.

Updated Date - Jun 18 , 2024 | 03:43 AM