లక్కీ భాస్కర్‌ వచ్చేది ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:19 AM

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. 1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఓ సాధారణ బ్యాంక్‌ క్యాషియర్‌ ప్రయాణాన్ని చూపించే సినిమా...

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. 1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఓ సాధారణ బ్యాంక్‌ క్యాషియర్‌ ప్రయాణాన్ని చూపించే సినిమా ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ‘లక్కి భాస్కర్‌’ చిత్రం కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ బంగ్లాన్‌ 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్స్‌తో పునర్నిర్మించారు. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే భారీ బ్యాంక్‌ సెట్‌ను కూడా రూపొందించారు మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:19 AM