నాకెప్పుడు న్యాయం జరుగుతుందో?

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:21 AM

గాయని చిన్మయి మరోసారి తమిళ రచయిత వైరముత్తుపై విమర్శల దాడి చేశారు. కెరీర్‌ ఆరంభంలో తనను వైరముత్తు లైంగికంగా వేధించాడని 2018 మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి...

నాకెప్పుడు న్యాయం జరుగుతుందో?

గాయని చిన్మయి మరోసారి తమిళ రచయిత వైరముత్తుపై విమర్శల దాడి చేశారు. కెరీర్‌ ఆరంభంలో తనను వైరముత్తు లైంగికంగా వేధించాడని 2018 మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తమిళ పరిశ్రమ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చిన్మయి పైనే నిషేధం విధించింది. గతేడాదే ఆ నిషేఽధం తొలగింది. వైరముత్తు రచించిన ‘మహా కవితై’ పుస్తకావిష్కరణ ఇటీవలే చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌, కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం, కమల్‌ హాసన్‌ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిన్మయి సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను లైంగికంగా వేధించడమే కాకుండా, నా కెరీర్‌ను నాశనం చేసిన వ్యక్తికి చాలా పెద్ద వ్యక్తుల మద్దతు ఉంది. నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో?’ అని స్పందించారు.

Updated Date - Jan 03 , 2024 | 01:21 AM