‘బడ్డీ’ వచ్చేది ఎప్పుడంటే..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:43 AM

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న ‘బడ్డీ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా...

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న ‘బడ్డీ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ హీరోయిన్లు. శామ్‌ ఆంటోనీ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు జ్ఞాన్‌వేల్‌ రాజా, అధన చెప్పారు. ఈ చిత్ర నిర్మాణం ఇండియన్‌ సిల్వర్‌ స్ర్కీన్‌ మీద కొత్త ప్రయత్నం అని వారు చెప్పారు. పంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ స్వరపరిచిన పాటలు మంచి ఆదరణ పొందాయని చెప్పారు.

Updated Date - Jul 18 , 2024 | 12:43 AM