సలార్‌ 2 షూటింగ్‌ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:11 AM

‘సలార్‌’ మూవీతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు ప్రభాస్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కబోతోన్న ‘శౌర్యాంగ పర్వం’పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, పార్ట్‌-1లో భారవి పాత్రలో నటించిన నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, నటుడు బాబీ సింహా...

సలార్‌ 2 షూటింగ్‌ ఎప్పుడంటే..?

‘సలార్‌’ మూవీతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు ప్రభాస్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కబోతోన్న ‘శౌర్యాంగ పర్వం’పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, పార్ట్‌-1లో భారవి పాత్రలో నటించిన నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, నటుడు బాబీ సింహా ఈ చిత్రంపై అప్‌డేట్‌ ఇచ్చారు. షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని మీడియాకు తెలిపారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే ఈ సీక్వెల్‌ గురించి నిర్మాత విజయ కిరగందూర్‌ మాట్లాడారు. పార్టు-2 స్ర్కిప్టు వర్క్‌ పూర్తయిందని తెలిపారు. మొదటి భాగానికి దక్కిన ఆదరణ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నామని అన్నారు. ‘శౌర్యాంగ పర్వం’ హాలివుడ్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను పోలి ఉంటుందంటూ వెల్లడించి పార్ట్‌-2పై అందరిలోనూ ఆసక్తిని రెట్టింపు చేశారు. కాగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ‘సలార్‌’ పార్ట్‌-1 గతేడాది డిసెంబర్‌ 22న విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా ప్రభాస్‌ను సరికొత్త యాక్షన్‌ అవతార్‌లో చూపించారని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ‘సలార్‌’ రిలీజ్‌ సమయానికే పార్ట్‌-2 షూటింగ్‌ 40 శాతం పూర్తైంది. మిగిలిన వర్క్‌ పూర్తి చేసి, 2025లో విడుదల చేయడానికి మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:37 AM